: భర్త అంతిమ సంస్కారం అడ్డుకున్న మొదటి భార్య
భర్త అంతిమ సంస్కారాన్ని ఓ భార్య అడ్డుకున్న ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. కశింకోట మండలం నడిసింగిబిల్లి గ్రామంలో ఓ వ్యక్తి చితికి నిప్పంటించారు. ఇంతలో అక్కడికొచ్చిన అతని మొదటి భార్య, తన భర్తను రెండో భార్య కుటుంబ సభ్యులే చంపేశారని ఆరోపించింది. అంతటితో ఆగక.. మండుతున్న చితిపై నీళ్లు పోసి దహన సంస్కారాలను అడ్డుకుంది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు రంగంలోకి దిగి, సగం కాలిన శవాన్ని చితి నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.