: కాంగ్రెస్ లో చేరబోతున్న నందన్ నీలేకని!


భారతీయ వ్యాపారి, ఆధార్ ప్రోగ్రామ్ ఛైర్మన్ నందన్ నీలేకని కొద్ది రోజుల్లో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో హస్తం పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని కర్ణాటక పీసీసీ చీఫ్ జి.పరమేశ్వ చెప్పారు. ఒకసారి చేరిన వెంటనే లోక్ సభ ఎన్నికలకు ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అయితే, ఆ నిర్ణయాన్ని ఏఐసీసీ తీసుకుంటుందని వివరించారు. అయితే, రానున్న లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి నీలేకనీ పోటీ చేయబోతున్నారన్న వార్తలపై వివరణ ఇచ్చిన ఆయన.. ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదన్నారు.

  • Loading...

More Telugu News