: ఏకంగా ఏటీఎం మిషన్ నే ఎత్తుకెళ్లిపోయారు


ఏటీఎం మిషన్లను పగులగొట్టి డబ్బు తస్కరించడం, ఒంటరిగా వెళ్ళే వారిపై దాడి చేసి డబ్బును దొంగలించడం రొటీన్ అయిపోయిందనుకున్నారో ... ఏమో కానీ... ఈ దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్ నే ఎత్తుకెళ్లిపోయారు. రాజస్థాన్ లోని జైపూర్ దగ్గర్లోని సికర్ జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం కేబిన్ లో ఉన్న ఏటీఎం మిషన్ ను దొంగలు ఎత్తుకెళ్లిపోయినట్టు ఈ ఉదయం ఆఫీస్ కు వచ్చిన అధికారులు గుర్తించారు. మిషన్ లో సుమారు 20 లక్షలు ఉండవచ్చని సమాచారం. కాగా, ఏటీఎం ఏర్పాటు చేసిన క్యాబిన్ లో సీసీ కేమెరాలు లేకపోవడం విశేషం. దీనిపై స్థానిక ఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News