: భారత్ కు పాక్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
భారత్ కు దాయాది దేశం పాకిస్థాన్ అరవై ఐదవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ తో తాము పరస్పర సహకారం, ప్రయోజనవంతమైన సంబంధాన్ని కోరుకుంటున్నట్లు పాక్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ ప్రజల, పురోగతి, అభివృద్ధిని కోరుకుంటున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహపూరితమైన, పరస్పర సంబంధాలను తాము ఆకాంక్షిస్తున్నామన్నారు.