: బిల్లు వెనక్కి పంపే తెలివితేటలు సీఎంకి లేవు: గాలి
రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి పంపే తెలివితేటలు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేవని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, బిల్లును వెనక్కి పంపేలా సోమవారమే తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లును వెనక్కి పంపే విషయంలో సీమాంధ్ర నేతలంతా ఒకే మాటమీద నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.