: సీఎం నోటీసును వ్యతిరేకిస్తూ స్పీకర్ ను కలిసిన తెలంగాణ నేతలు
తెలంగాణ బిల్లును తిప్పి పంపించాలని స్పీకర్ కు సభా నాయుకుడి హోదాలో సీఎం నోటీసులు పంపడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి నోటీసును వ్యతిరేకిస్తూ సభాపతి నాదెండ్ల మనోహర్ ను చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, వినయ్ భాస్కర్, టీఆర్ఎస్ నేతలు ఈటెల, కేటీఆర్ లు కలిశారు. బిల్లుపై తమకు అభ్యంతరాలు లేవని, బిల్లుపై చర్చ ముగించి పంపించాలని స్పీకర్ ను కోరారు.