: విభజన బిల్లు వెనక్కి పంపాలని స్పీకర్ కు సీఎం నోటీసు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును వెనక్కి పంపాలని సభాపతి నాదెండ్ల మనోహర్ కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు పంపారు. బిల్లు తప్పుల తడకగా ఉన్నందున వెనక్కి పంపాలని సభానాయకుడి హోదాలో సీఎం ఈ నోటీసిచ్చినట్లు సమాచారం. సభా నిబంధన కింద బిల్లు వెనక్కి పంపేందుకు తీర్మానం చేయాలని నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తరపున మంత్రి శైలజానాథ్ స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. కాగా, ముసాయిదా బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి పంపే అధికారం రాష్ట్రపతికి లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటులో పెట్టే ఒరిజనల్ బిల్లును మాత్రమే సభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపాలని చెప్పారు. అయితే, ఈ విషయంలో రాష్ట్రపతి పొరబాటు ఏమీ లేదని చెప్పారు.అటు శాసనమండలిలో కూడా బిల్లు వెనక్కి పంపాలని ఛైర్మన్ కుమంత్రి సి.రామచంద్రయ్య నోటీసిచ్చారు.

  • Loading...

More Telugu News