: ఏటా 15 కోట్ల రూపాయల వ్యాపారంతో ‘గోదావరి గోలీ సోడా‘


బహుళ జాతి కంపెనీలతో నిండిపోయిన శీతల పానీయాల మార్కెట్లో ‘గోదావరి గోలీ సోడా’ పోటీపడుతోంది. అవును, వేల కోట్ల రూపాయల ప్రచారం, టాప్ సెలబ్రిటీలతో ప్రకటనలు, అదిరిపోయే ఆఫర్లు.. ఇవన్నీ తట్టుకుని నిలబడింది ‘ఆర్టోస్’. ఉభయ గోదావరి జిల్లాలకు పరిచయం అక్కర్లేని కూల్ డ్రింకే ఈ ‘ఆర్టోస్’. యాభై ఏళ్ల చరిత్ర ఉన్నఆర్టోస్ ను ఏఆర్ రాజు డ్రింక్స్ తయారుచేస్తోంది. 1919లో ఏఆర్ రాజు డ్రింక్స్ పేరిట శీతల పానీయ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 1955లో పూర్తి ఆటోమిషన్ కావడంతో ‘ఆర్టీస్’ బ్రాండ్ బయటకు వచ్చింది. అప్పుడే దీనికి సంబంధించిన పేటెంట్ హక్కులను కూడా తీసుకున్నారు. ఇప్పటికీ ఈ కూల్ డ్రింక్ తయారీకి సంబంధించిన ముడిపదార్థాల మిశ్రమాన్ని వారసత్వంగా రామచంద్రరాజు కుటుంబం మాత్రమే తయారుచేస్తుంది.

పెద్ద కంపెనీల నుంచి పోటీని తట్టుకునేందుకు విభిన్న మార్కెటింగ్ వ్యూహాన్ని అనుసరించామని నిర్వాహకులు చెప్పారు. బహుళ జాతి కంపెనీల పోటీతో చిన్న చిన్న గ్రామాలపై దృష్టి పెట్టామని, మా పానీయాలు విక్రేతలకు ఎక్కువ మార్జిన్లు ఆఫర్ చేశామని వారు చెప్పారు. కోకాకోలా బాటిల్ పై రూపాయి కమీషన్ గా ఇస్తే.. ఆర్టోస్ రూపాయి 75 పైసలు ఇస్తోందన్నారు. దాంతో విక్రేతలు ఆర్టోస్ కే మొగ్గు చూపారని వారు తెలిపారు. అలాగే మిగతా కంపెనీలు చిన్న బాటిల్ ను పది రూపాయలకు విక్రయిస్తుంటే, ఆర్టోస్ ఎనిమిది రూపాయలే కావడంతో కొనుగోళ్లు కూడా పుంజుకున్నాయని వారు చెప్పారు. దీంతో గతేడాది తాము 15 కోట్ల టర్నోవర్ ను సాధించినట్లు నిర్వాహకుడు వర్మ మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News