: ఉండవల్లికి రాజ్యసభ అవకాశం ఇవ్వమని సీఎంను కోరా: ఎంపీ హర్షకుమార్
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ కుమార్ కు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరినట్లు ఎంపీ హర్షకుమార్ చెప్పారు. అంతేగాక, ఈ ఎన్నికల్లో కేవీపీ రామచంద్రరావుకు తాము మద్దతిస్తామని తెలిపారు. తెలంగాణ విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోందన్న హర్షకుమార్, పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టకముందే తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ కోరతామని చెప్పారు.