: శాసనసభ సోమవారానికి వాయిదా
శాసనసభలో సీఎం ప్రసంగం సందర్భంగా సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, శాసనసభ్యుల అభ్యంతరాలు తీర్చేందుకు అటార్నీ జనరల్ ను సభకు పిలిపించాలని స్పీకర్ ను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, శాసనసభకు హక్కులు ఉన్నాయని వాటి అనుగుణంగానే సభ జరుగుతుందని అన్నారు. అలాగే శాసనసభ ప్రజాస్వామ్య బద్దంగానే వ్యవహరిస్తుందని, చర్యలు తీసుకోవడం, చర్చ తరువాత రూలింగ్, ఓటింగ్, అభిప్రాయ సేకరణ అన్నీ సంప్రదాయాల ప్రకారం జరుగుతాయని స్పీకర్ స్పష్టం చేశారు. శాసనసభ విధులకు ఆటంకం కలుగకుండా ఎలా వ్యవహరించాలో సభకు పూర్తి అవగాహన ఉందని, సభా హక్కులను ఎవరూ భంగపరచలేరని చెబుతూ సభను సోమవారం ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.