: లోపభూయిష్టమైన బిల్లును ఆమోదించేందుకు సిద్ధంగా లేము: బాబు


లోపభూయిష్టమైన బిల్లును ఆమోదించేందుకు సిద్ధంగా లేమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. శాసనసభ అధికారాలను ఢిల్లీకి తాకట్టు పెట్టేందుకు తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి బిల్లును తిప్పి పంపే అధికారం ఉందని, అలా ఎందుకు చేయలేదని బాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ గతంలో కాంగ్రెస్ మెడలు వంచిన తీరును గుర్తు చేసుకుని, ఆ రకంగా కేంద్రానికి బుద్ధి చెప్పి మరోసారి తెలుగు ప్రజల ఐక్యతను చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుల తడకగా ఉన్న బిల్లును ఆమోదించాల్సిన అవసరం శాసనసభకు లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News