: గుజరాత్ రికార్డును మహారాష్ట్ర బద్దలు కొట్టే యత్నం
గుజరాత్ రికార్డును మహారాష్ట్ర బద్దలు కొట్టే యత్నం చేస్తోంది. 182 మీటర్ల ఎత్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ స్థాపనకు గుజరాత్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహంగా రికార్డు నమోదవుతుంది. అయితే, ఆ రికార్డేదో మన ఖాతాలో వేసుకుంటే పోలా? అనుకుందో ఏమో, మహారాష్ట్ర ప్రభుత్వం 200 మీటర్ల పొడవైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముంబై తీరానికి సమీపంలో అరేబియన్ సముద్ర జలాల్లో ఉన్న రాతి శిలపై 98 మీటర్ల పొడవైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించగా.. అదిప్పుడు 200 మీటర్లకు పెంచాలని నిర్ణయించింది. అయితే, అంత ఎత్తున్న విగ్రహాన్ని ఆ శిల తట్టుకుంటుందా? లేదా? ఏర్పాటు చేయవచ్చా? అన్న విషయాలను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను ఐఐటీ బాంబేకు అప్పగించింది.