: ‘బ్రింగ్ బాబు బ్యాక్’ యువ సదస్సుకు ముఖ్య అతిథిగా నారా లోకేష్


వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే లక్ష్యంతో ‘బ్రింగ్ బాబు బ్యాక్’ ఫోరం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఫోరం ఇవాళ (శనివారం) సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు కూకట్ పల్లి 7వ ఫేజ్ లోని జీహెచ్ ఎంసీ క్రీడా మైదానంలో యువ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు టీడీపీ నేత నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు టీడీపీ మీడియా కమిటీ ఛైర్మన్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యువ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మందికి పైగా ఫోరం వాలంటీర్లు హాజరు కానున్నారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News