: 'బాద్ షా' ఆడియో వేడుకలో తొక్కిసలాట... ఒకరి మృతి
జూనియర్ ఎన్టీఆర్ - శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిన 'బాద్ షా' చిత్రం ఆడియో వేడుకలో అపశృతి దొర్లింది. తొక్కిసలాటలో ఊపిరాడక, వరంగల్ జిల్లా ఉర్సుగుట్టకు చెందిన అభిమాని రాజు మృతి చెందాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి అంచనాకు మించి అభిమానులు తరలి రావటంతో, ఈ ఘటన చోటుచేసుకుంది.