: బిల్లులో వివరాలు ఏవీ లేవు.. ఎలా చర్చిస్తాం?: సీఎం


కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి బిల్లు పంపినప్పుడే అన్ని వివరాలను సవివరంగా పేర్కొనాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో పేర్కొన్నారు. అయితే, ఇందుకు అనుగుణంగా విభజన ముసాయిదా బిల్లులో ఏ ఒక్క దానిపై కూడా స్పష్టత లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం ఏమిటనే దానిపై స్పష్టత ఇవ్వకుండా, విభజన చేస్తున్నాం.. చర్చించమని చెబితే దేనిమీద చర్చించాలని ఆయన ప్రశ్నించారు. తగిన వివరాలు ఇవ్వకుండా.. ఏ ప్రాంతానికి ఏం చేస్తున్నారు? విభజన వల్ల రెండు ప్రాంతాలకు ఏ రకమైన లాభం చేకూరుతుంది? అనే వివరాలు లేకుండా, రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన నిలదీశారు.

ఆర్థిక అంశాలపై సవివరమైన విశ్లేషణ ఉండాలని ఆయన సూచించారు. ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి అరకొరగా కేంద్రం ఎలా పంపుతుంది? దానిని రాష్ట్రపతి ఎలా శాసనసభకు పంపించారు? అనేది వివరించాలని ఆయన కోరారు. విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారో తెలుపకుండా ఎలా విభజిస్తారని ఆయన స్పీకర్ ను అడిగారు.

  • Loading...

More Telugu News