: అంతర్జాతీయ హ్యాకింగ్ రాకెటు రట్టు.. మూడు దేశాల్లో తనిఖీలు
అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఐ) ఇచ్చిన సమాచారంతో ఏక కాలంలో భారత్, చైనా, రోమేనియా దేశాల్లో నిఘా, దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించాయి. మన దేశంలో పుణె, ఘజియాబాద్, ముంబై తదితర ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించి తలపండిన హ్యాకింగ్ అమిత్ విక్రమ్ తివారీ(31)ని అరెస్ట్ చేసింది. ఇతడి తండ్రి ఆర్మీలో విశ్రాంతి కల్నల్. అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నడుస్తున్న హ్యాకింగ్ రాకెట్ గురించి ఎఫ్ బీఐ సమాచారం అందించింది.
ఈ హ్యాకింగ్ వెనుక కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. స్పాట్ బెట్టింగ్ తో విమర్శల పాలైన ఐపీఎల్.. ఈ హ్యాకింగ్ వార్తల్లోనూ తెరపైకి వచ్చింది. ఐపీఎల్ తో సంబంధం ఉన్న పలువురు కొన్ని ఖాతాలను హ్యాక్ చేయాలని హ్యాకర్ తివారీని సంప్రదించినట్లు సమాచారం. ఇలా ఎంతో మంది ప్రముఖులు తివారీతో వ్యవహారాలు నడిపినట్లు భావిస్తున్నారు. ఇతడికి విదేశాల్లోని హ్యాకర్లతో సంబంధాలు ఉండి ఉంటాయని, అసలు మాస్టర్ హ్యాకర్ వేరే ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 2011 ఫిబ్రవరి నుంచి 2013 నుంచి ఫిబ్రవరి వరకు 900 ఈ మెయిల్ ఖాతాలను తివారీతోపాటు విదేశీ హ్యాకర్లు హ్యాక్ చేశారు. వీటిలో భారతీయుల ఈ మెయిల్ ఖాతాలు 171 వరకు ఉన్నాయి.