: రాజ్యసభకు పోటీ చేసే ఆలోచన నాకు లేదు: అశోక్ బాబు
రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన తనకు లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు 'చలో హైదరాబాద్' కార్యక్రమంపై అందులో చర్చిస్తామన్నారు. అయితే, రాజ్యసభ ఎన్నికల్లో సమైక్యవాదులను నిలబెట్టే అంశాలను అఖిలపక్షంలో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో బిల్లా? తీర్మానమా? అనే విషయంపై స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.