: మరోసారి టాపార్డర్ వైఫల్యం..కష్టాల్లో టీమిండియా
టీమిండియా టాపార్డర్ మరోసారి విఫలమైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(39), శిఖర్ ధావన్(28) కీలక సమయాల్లో అవుటవ్వడంతో టీమిండియా మరోసారి లక్ష్యఛేదనలో తడబడింది. అనంతరం బరిలో దిగిన విరాట్ కోహ్లీ(6), అజింక్యా రహానే(3) ఇద్దరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజులో రైనా(25), దోనీ(22)లు ఉన్నారు. మరోసారి వీరిద్దరూ టీమిండియా భారాన్ని భుజంమీద వేసుకున్నారు. కివీస్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంటుండడంతో టీమిండియా 25 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.