: జ్ఞాపకాల గుట్టు రట్టయింది!


చిన్నప్పడు చేసిన చిలిపి అల్లరి మనకు ఇప్పటికీ గుర్తుంటుంది. మరికొందరికి బాల్య స్మృతులు మధురానుభూతులను కలిగిస్తాయి. దానికి కారణం జ్ఞాపక శక్తి. అయితే, మన మెదడులోని నాడీకణాలు జ్ఞాపకాలను ఎలా రూపొందించుకుంటాయన్న ప్రక్రియపై సుదీర్ఘంగా పరిశోధనలు సాగుతున్నాయి. కానీ, నాడీకణాలు సున్నితమైనవి కావడంతో ఇవి ముందుకు సాగడం లేదు.

తాజాగా యెషివా వర్శిటీ పరిశోధకులు ఈ విషయాల గురించి కొన్ని రహస్యాలను కనుగొన్నారు. జ్ఞాపకాల రూపకల్పనలో ప్రధానంగా పనిచేసే నాడీకణాల్లోని ఎంఆర్ఎన్ఏ అణువులకు వెలిగే ‘సూచిక’లను తగిలేలా చేసి.. దీన్ని సాధించారు. ‘వేర్ల‘ వంటి భాగాల వద్ద నాడీకణాలు ఒకదానికొకటి బలంగా అతుక్కుపోతున్నట్లు ఈ పరిశోధనలో గుర్తించారు. నాడీ ప్రేరణలు తరచుగా జరుగుతున్నప్పుడు ఈ బంధాలు మరింత బలోపేతమవుతున్నట్లు, అంటే.. ఒక చేయి మరో చేత్తో అతుక్కుపోయేంత గట్టిగా అవి ఉంటున్నట్లు తేలింది. నాడీకణాలు ఒక దానితో ఒకటి తాకినపుడు దీర్ఘకాలం కొనసాగే అనుసంధాన బంధాలు ఏర్పడుతున్నట్టు, ఇవి జ్ఞాపకాల రూపంలో పదిలంగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు.

  • Loading...

More Telugu News