: దేశ ప్రజలంతా కేంద్రంలో 'బీజేపీ'నే కోరుకుంటున్నారు: వెంకయ్య
రెండు దఫాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వ యూపీఏ సర్కారుతో దేశ ప్రజలు విసిగిపోయారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. దేశ ప్రజలంతా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు.
'బీజేపీ'ని బలపరుద్దాం, దేశాన్ని రక్షిద్దాం.. అనే నినాదంతో 2014 ఎన్నికల బరిలో దిగుతామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.