: ప్రత్యేక సమావేశాల్లో జనలోక్ పాల్ బిల్లును ఆమోదిస్తాం: కేజ్రీవాల్


జనలోక్ పాల్ బిల్లు దాదాపు సిద్ధమయిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఫిబ్రవరిలో రామ్ లీలా మైదానంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును ఆమోదింపజేస్తామని చెప్పారు. ఇదే సమయంలో తన రెండు రోజుల ధర్నాపై మాట్లాడిన కేజ్రీవాల్.. ఓ ముఖ్యమంత్రి ధర్నా చేయకూడదని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదన్నారు. తను ఎక్కడా చట్టాన్ని ధిక్కరించలేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News