: డీఎంకేలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది?: అళగిరి


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డీఎంకేలోని అన్ని పదవుల నుంచి పెద్ద కుమారుడు అళగిరిని నిన్న (శుక్రవారం) అధినేత కరుణానిధి తొలగించిన సంగతి తెలిసిందే. దానిపై ఈ రోజు ఓ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూలో స్పందించిన అళగిరి.. డీఎంకే (ద్రవిడ మునేట్ర కజగమ్)లో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. తాను పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని మాత్రమే డిమాండు చేశానన్నారు. అంతేకాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎక్కడా పాల్పడలేదన్నారు. తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News