: బిల్లుపై మరింత గడువు కోరుతున్న సీమాంధ్ర టీడీపీ
విభజన ముసాయిదా బిల్లుపై సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు అదనపు సమయం కోరుతున్నారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఈ రోజు సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు అనధికార నోటీసు ఇచ్చారు. రాష్ట్రపతి ఇచ్చిన వారం రోజుల గడువు చాలదని నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి, ఫిబ్రవరి 28 వరకు గడువు కోరుతూ లేఖ రాయాలని స్పీకర్ ను కోరారు.