: నేడు భారత్ కు జపాన్ ప్రధాని రాక
జపాన్ ప్రధాని షింజో అబే మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు భారత్ కు వస్తున్నారు. ఈ సందర్భంగా భారత్ కు ఆయన రూ.12,000 కోట్ల రుణాన్ని ప్రకటించనున్నారు. తక్కువ వడ్డీకి ఇచ్చే ఈ రుణాన్ని సబ్ వే లైన్ల నిర్మాణం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్టుల కోసం జపాన్ ఇవ్వనున్నట్టు నిక్కీ ఎకనమిక్ పత్రిక తెలిపింది. దీంతో ఈ విషయంపై ఇరు దేశాల ప్రధానులు నేడు చర్చించవచ్చని సమాచారం. న్యూఢిల్లీ సబ్ వే వ్యవస్థను విస్తరించే పనుల్లో జపాన్ కంపెనీలు పాలుపంచుకోనున్నాయి.