: శాసనసభలో నేడు చంద్రబాబు ప్రసంగించే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఈ రోజు శాసనసభలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రసంగించే అవకాశం ఉంది. ఆయన ప్రసంగం ఐదారు గంటల పాటు సాగేలా కసరత్తు చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన మూడో విడత ప్రసంగాన్ని సుమారు గంటన్నర పాటు కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.