: 'సడక్ బంద్'ను విజయవంతం చేస్తాం: హరీష్ రావు
ఈనెల 21న నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్ విజయవంతం అవుతుందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అవాంతరాలొచ్చినా బంద్ ను విజయవంతం చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. సడక్ బంద్ ను నిర్వీర్యం చేయాలని సీమాంధ్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఇందుకోసం కిరణ్ సర్కారు 11వేల మంది పోలీసులను రప్పించిందన్నారు. ఈ బలగాలను రాజధానిలో పేట్రేగిపోతోన్న ఉగ్రవాద నిర్మూలన కోసం వెచ్చిస్తే బావుంటుందని ఆయన సీఎంకు సలహా ఇచ్చారు.