: రాజ్యసభకు శరద్ పవార్ నామినేషన్
ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్సీపీ నుంచి మరో అభ్యర్థిగా పార్టీ నేత మజిద్ మెమన్ కూడా నామినేషన్ వేశారు. ఈ మేరకు ముంబైలోని రిటర్నింగ్ అధికారికి రెండు జతల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఫిబ్రవరి 7తో నామినేషన్ దాఖలుకు గడువు ముగియనుంది.