: సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నీలో పాక్ పై భారత్ జయభేరి
సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నీలో భాగంగా ఇవాళ ఐదో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ పై విజయం సాధించింది. మలేసియాలోని ఇఫో పట్టణంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 4-2 తేడాతో పాక్ ను చిత్తుచేసింది. మలేషియాతో నిన్న జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్ ను భారత్ 2-2 గోల్స్ తో డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ టోర్నీ కోసం మలేసియా - ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ లో తలపడబోతున్నాయి.