: వన్డేల్లో అగ్రస్థానానికి ఎగబాకిన టీమిండియా


టీమిండియాకు ఊరట లభించింది. అయితే సత్తా చూపకుంటే ఇది కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగులుతుంది. న్యూజిలాండ్ సిరీస్ లో దారుణ వైఫల్యంతో టీమిండియా తన వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని ఆసీస్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే మూడు రోజులు కూడా దాటకుండానే, అసలు ప్రయత్నం కూడా చేయకుండానే తిరిగి ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని ఇండియా దక్కించుకుంది.

పెర్త్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాల్గో వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ర్యాకింగ్స్ కు సంబంధించి ఆసీస్ రెండు పాయింట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో, 117 పాయింట్లతో భారత్ మరోసారి ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 116 పాయింట్లతో ఆసీస్ రెండో స్థానంలోనూ, 114 పాయింట్లతో సౌతాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News