: విదేశీ యాత్రికుడి ప్రాణం తీసిన మంచుగడ్డలు
కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో మంచుగడ్డలు విరిగిపడి విదేశీ పర్యాటకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గత కొన్ని రోజులుగా జమ్మూకాశ్మీర్ లో మంచు విపరీతంగా కురుస్తోంది. పెద్దఎత్తున కురుస్తున్న మంచు కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా జమ్మూకాశ్మీర్ లో నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచు పెద్దఎత్తున కురుస్తుంది.