: నానో ఉపగ్రహాలతో అంతరిక్షంలో ట్రాఫిక్ నియంత్రణ!
అంతరిక్షంలో ట్రాఫిక్ నియంత్రణకు నానో ఉపగ్రహాలు వాడాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతరిక్షంలో పెరిగిపోతున్న ఉపగ్రహాలు, శకలాలు ఒకదానికొకటి ఢీ కొట్టుకోకుండా మినీ ఉపగ్రహాలను వాడాలని వారు భావిస్తున్నారు. దిగువ భూ కక్ష్యలోని మరో ఉపగ్రహం కక్ష్యను సరి చేయటంలో అవి సాయపడతాయని అమెరికాలోని 'లారెన్స్ రివర్ మోర్ నేషనల్ లాబొరేటరీ'కి చెందిన పరిశోధకులు తేల్చారు. ఢీ కొట్టుకునే పరిస్థితిని నివారించేందుకు తమ ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతూ, ఈ తరహా పరిశీలనలు జరుపుతుందని వారు వెల్లడించారు.
"అంతరిక్షంలో ఉపగ్రహాలు, శకలాల మధ్య ఢీ కొట్టుకోవడాలు చాలా సమస్యాత్మకంగా మారాయి. అయితే భూ దిగువ కక్ష్యలో ఉపగ్రహ స్థితిని నిర్దారించడం చాల కష్టం. ఈ సమస్యను నానో ఉపగ్రహాలు తీరుస్తాయి" అని పరిశోధకుడు లాన్స్ సిమ్స్ చెప్పారు. దీని కోసం 'స్టేర్' అనే ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.