: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన మోత్కుపల్లి.. అలకే కారణమా?


తన వాక్చాతుర్యంతో, తూటాల్లాంటి మాటలతో విరుచుకు పడే టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఈ రోజు శాసనసభకు హాజరుకాలేదు. రాజ్యసభ సీటు వ్యవహారంలో మోత్కుపల్లి మనస్థాపానికి గురయ్యారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి, ఈసారి పెద్దల సభకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంలో తనకు సహకరించాల్సిందిగా తమ పార్టీకి చెందిన పలువురు నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను కూడా ప్రారంభించారు. కచ్చితంగా మద్దతిస్తామని కొంతమంది ఎమ్మెల్యేలు హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే శాసనసభలో చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన చూట్టూ జరుగుతున్న వ్యవహారంతో మోత్కుపల్లి విసిగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అలక వహించిన ఆయన... ఇకపై కూడా అసెంబ్లీకి రాకపోవచ్చని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News