: రేపటినుంచి పార్లమెంటును స్థంభింపజేస్తాం: కేసీఆర్


తెలంగాణ అంశం మీద రేపటినుంచి పార్లమెంటును స్థంభింపచేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. శరద్ పవార్ సహా ఢిల్లీలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న నేతలందరినీ కలుస్తామని వెల్లడించారు. తెలంగాణ ఇస్తున్నామని చెప్పి యూపీఏ ప్రభుత్వం మాటతప్పిందన్నారు. అటు శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటతీరూ సరిగా లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

శాసనసభలో తెలంగాణకు పైసా ఇవ్వమని సీఎం అనటం సభాహక్కుల ఉల్లంఘనే అని దీనిపై చర్యలకు న్యాయనిపుణులతో మాట్లాడుతున్నట్టు కేసీఆర్ చెప్పారు. బస్తీ మే సవాల్ అంటూ సీఎం స్థాయి వ్యక్తి సభలో మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరని అభిప్రాయపడ్డారు.

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ ఇవాళ విజయశాంతితో కలిసి ఢిల్లీ వెళ్లేముందు హైదరాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News