: ఆమ్ ఆద్మీకి భారీ స్పందన.. 50 లక్షలకు చేరిన సభ్యుల సంఖ్య!


లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 'మై భీ ఆమ్ ఆద్మీ' పేరుతో ఏఏపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య 50 లక్షలకు చేరినట్లు పార్టీ తాజాగా విడుదల చేసిన నివేదిక తెలిపింది. అయితే, ఇందులో ఉత్తరాది నుంచి ఎక్కువ స్పందన రాగా, దక్షిణాది రాష్ట్రాల నుంచి తక్కువ స్పందన వచ్చిందని పేర్కొంది. తమిళనాడు, కర్ణాటకలో 59వేల మంది సభ్యత్వం తీసుకుంటే, అందులో 49వేల మంది ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకున్నట్లు వివరించింది. అటు కేరళలో 40వేల మంది ఏఏపీలో చేరినట్లు వెల్లడించింది. ఇదిలావుంటే విభజన నేపథ్యంలో తెలంగాణ, సమైక్యాంధ్ర విబేధాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి అంతగా స్పందన రాలేదని చెప్పింది.

ఇక ఉత్తరాది వైపు వెళితే.. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా నుంచి భారీ స్పందన వచ్చిందని తెలిపింది. యూపీలో 7.35 లక్షల సభ్యులు, ఢిల్లీలో 3.6 లక్షలు, మహారాష్ట్రలో 3.43 లక్షలు, హర్యానాలో 3.25 లక్షలు, గుజరాత్ లో 2.8 లక్షలు, ఉత్తరాఖండ్ లో 1.36 లక్షలు, బీహార్ లో 1.21 లక్షల మంది చేరినట్లు పేర్కొంది. ఈ నెల 26తో సభ్యత్వ నమోదు ముగియనున్నట్లు పార్టీ సినియర్ నేత గోపాల్ రాయ్ తెలిపారు.

  • Loading...

More Telugu News