: శాసనసభ రేపటికి వాయిదా
రాష్ట్ర శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు సభలో టీబిల్లుపై చర్చ కొనసాగుతుండగా... చర్చపై గడువును మరింత పెంచాలంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సమయం సరిపోతుందంటూ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సభను ఆర్డర్ లో ఉంచడానికి స్పీకర్ నాదెండ్ల ప్రయత్నించినప్పటికీ... సభ్యులు సహకరించకపోవడంతో... సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.