: సమ్మె నిర్ణయం విరమించుకోండి: బొత్స
ఆర్టీసీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఎంత ఇవ్వాలనే దానిపై అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీపై ఇప్పటికే ఉన్న ఆర్థిక భారం, సంస్థ నష్టాలు, మనుగడ వంటి సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకుని సమ్మె ఆలోచన విరమించుకోవాలని కార్మికులకు సూచించారు. సమస్య పరిష్కారమయ్యేవరకు చర్చలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.