: పొట్ట పెరగటానికి కారణ 'జన్యువు' తెలిసిపోయింది
పొట్ట పెరగటానికి కారణమైన ఐదు కొత్త జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఊబకాయాన్ని తగ్గించే అధునాతన చికిత్సలను రూపొందించేందుకు ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడగలవని భావిస్తున్నారు. పొట్ట వద్ద కొవ్వు పేరుకోవడాన్ని నడుము, తుంటి చుట్టుకొలతల నిష్పత్తి ప్రతిబింబిస్తుంది. నడుము, తుంటి నిష్పత్తి పెరగటానికి సంబంధం కల ఐదు కొత్త జన్యువులను ల్యుసివిలే వర్శిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ జన్యువుల్లో మూడు స్త్రీ, పురుషులిద్దరిలోనూ.. రెండు జన్యువులు మాత్రం మహిళల్లోనే ఉంటున్నాయి. కొవ్వు కణాలలో ప్రధానంగా వుండే ఎన్.హెచ్.సి1 జన్యువు.. 17 ప్రోటీన్లతో చర్య జరుపుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. పొట్ట పెరగటానికి ఎన్.హెచ్.సి1 జన్యువుకి సంబంధం వున్నట్టు గుర్తించడం తొలిసారని పరిశోధకుడు కిరా టేలర్ చెప్పారు.