: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకే మద్దతిస్తా: టీఆర్ఎస్ నేత
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తే వారికే తాను మద్దతిస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో చేరినప్పటికీ నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తాను టీడీపీలో ఉండగానే గెలుపొందానని, తనకు ఎమ్మెల్యే హోదా టీడీపీ కారణంగానే వచ్చిందని, అందువల్లే తాను టీడీపీకి అనుకూలంగా ఓటేస్తానని అన్నారు.