: నేను వేసుకున్న డ్రెస్ ధర రూ.1.85లక్షలు: బిపాషా
ఈవిడ ఏంటీ...? డ్రెస్ వేసుకుంటే వేసుకుంది. కానీ, దాని ధర అందరికీ తెలిసేలా దానిపై ట్యాగ్ తీసేయకుండా అలానే ఉంచిందేంటీ! ఇది ఆ రోజు బిపాషా బసును చూసిన వారు గుసగుసలాడినవి. 20వ 'లైఫ్ ఓకే' సినీ అవార్డుల కార్యక్రమానికి బిపాషా కళ్లు చెదిరే డ్రెస్ తో వచ్చినప్పుడు దానిపై 23,000 అని కనిపించేలా ఓ ట్యాగ్ ఉంది . దీనిపై బిపాషా ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. 'ఆ రోజు నా డ్రెస్ కు ఉన్న ట్యాగ్ ధర కాదు. అది కోడ్. నిజానికి ఆ రోజు నేను వేసుకున్న డ్రెస్ ధర 1.85లక్షల రూపాయలు' అంటూ ట్వీట్ చేసింది.