: తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 91 పరుగుల ఆధిక్యం
ఆస్ట్రేలియాతో మొహాలీలో జరుగుతోన్న మూడో క్రికెట్ టెస్ట్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ 132.1 ఓవర్ల వద్ద ఆలౌటై, 499 పరుగులకు ముగించింది. దీంతో భారత్ కు మొదటి ఇన్నింగ్స్ లో 91 పరుగుల ఆధిక్యత లభించినట్లైంది.
భారత ఆటగాళ్లు.. ధావన్ 187 పరుగులు, విజయ్ 153, సచిన్ 37, కుమార్ 18 పరుగులు చేయగా, కోహ్లీ 18 పరుగులతో నాటౌట్ గా నిలిచి తొలి ఇన్నింగ్స్ లో కీలక పాత్ర పోషించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు కడపటి వార్తలందేసరికి 29 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి ఆట కొనసాగిస్తోంది.
అంతకుముందు, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 408 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.