: టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఈ విషయాన్ని ఆయన అంగికరించారు కూడా. తెలంగాణ ప్రాంతంలో ప్రజలు కాంగ్రెస్ పక్షానే ఉన్నారని చెప్పడానికే... తాను కాంగ్రెస్ పెద్దలను కలిశానని చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలను గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనమవదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అయితే, కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనమయితే... తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.