: 30 రోజుల గడువుకావాలని తీర్మానం చేసి పంపుదాం: గాలి
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై 3 లేక 5 నిమిషాలే మాట్లాడాలని నిర్ణయించడానికి బీఏసీ ఎవరు? అని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని, అందుకు నెల రోజులు గడువు కావాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో కొనసాగి, ఇప్పుడు చివర్లో శాసనసభ తీర్మానం లేకుండా కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని ఆయన మండిపడ్డారు. శాసనసభ్యుల హక్కులు హరించడానికి బీఏసీకి హక్కులేదని ఆయన స్పష్టం చేశారు.