: మిర్రర్ రైటింగ్ లో ఐదు రికార్డులు సాధించిన కార్తీక
కరీంనగర్ జిల్లా వాసి బండారి కార్తీక తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మిర్రర్ రైటింగ్ (అక్షరాలను తిరగేసి రాయడం)లో ఐదు రికార్డులు సాధించింది. కార్తీక కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. గురువారం పాఠశాలలో నిర్వహించిన పరీక్షలో కార్తీక తెలుగులో 16 పేజీలు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, హిందీలో 13 పేజీలు మదర్ థెరిస్సా జీవిత చరిత్ర, ఇంగ్లీషులో 16 పేజీలు అబ్దుల్ కలాం జీవిత చరిత్రను మిర్రర్ రైటింగ్లో రాసి శభాష్ అనిపించుకొంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్బుక్ ఆఫ్ రికార్డు, మిరాకిల్స్ వరల్డ్ రికార్డు, వరల్డ్ అమేజింగ్ రికార్డు, ఆర్హెచ్ఆర్ రికార్డులను కార్తీక సొంతం చేసుకొంది.