: గళం వినిపించిన మహిళా బ్యాంకర్లు
బ్యాంకింగ్ రంగంలో మహిళలు ఎదుర్కొంటోన్న సమస్యలు.. నివారణ చర్యలను ముక్తకంఠంతో ఎలుగెత్తారు మహిళా బ్యాంకర్లు. 'భారతీయ స్టేట్ బ్యాంక్ రాష్ట్ర స్థాయి మహిళా అధికారుల సంఘం' సమావేశం దీనికి వేదికైంది. నేడు హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా అధికారులు మేథోమథనం చేశారు.
రాష్ట్రం నలుమూలల నుంచీ భారీ సంఖ్యలో వచ్చిన మహిళా అధికారులు ఈ సమావేశంలో అనేక అంశాల మీద తమ సలహాలు, సూచనలు ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో మహిళల పరిధి పెరగాల్సిన ఆవశ్యకతను దాదాపు అందరూ వ్యక్తం చేయటం గమనార్హం. సమావేశానంతరం ఎస్.బి.ఐ బ్యాంకు మహిళా ఉద్యోగుల సంఘం తరపున విద్యార్థినులకు బ్యాగ్స్ అందించారు