: చిరంజీవితో మాట్లాడాక తుది నిర్ణయం: గంటా


రానున్న రాజ్యసభ ఎన్నికల బరిలో సీమాంధ్ర నుంచి ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే ఎలా ఉంటుందనే విషయంలో వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు చాంబర్ లో ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ వ్యవహారంపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, జేసీ, చైతన్య రాజు లేదా తాను రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పారు. అయితే చిరంజీవితో మాట్లాడాకే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News