: సీఎం కిరణ్ తో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి: దిగ్విజయ్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఈ రోజు ఉదయం కూడా కిరణ్ తో మాట్లాడానని తెలిపారు. అసెంబ్లీలో టీబిల్లుపై చర్చ జరుగుతున్నందునే కిరణ్ ఢిల్లీకి రాలేకపోతున్నారని... దీని వెనుక మరే కారణమూ లేదని డిగ్గీరాజా క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈ విధంగా స్పందించారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు లోపలే బిల్లు ఢిల్లీకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు ఎలా ఉన్నా అభ్యంతరం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News