: విప్ ధిక్కరించిన వారిపై టీడీపీ కొరడా
అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ జారీచేసిన విప్ ధిక్కరించిన వారిపై కొరడా ఝుళిపించేందుకు ఆపార్టీ సమాయత్తమవుతోంది. ఈ విషయమై శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేయబోతున్నట్టు ఆ పార్టీ విప్ ధూళిపాళ్ల నరేంద్ర ఇవాళ హైదరాబాద్ లో వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోమని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీడీపీ విప్ జారీచేసిన విషయాన్ని ఈ సందర్భంగా నరేంద్ర గుర్తుచేశారు.