: అమెరికాకు తిరిగి వెళ్లేది లేదు: ఎడ్వర్డ్ స్నోడెన్


అమెరికా నిఘా సంస్థ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్.. ఆ దేశ రహస్యాలను ఇతర దేశాలకు చేరవేస్తున్నాడన్న కారణంతో, అతనిపై అమెరికా పగబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్నోడెన్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు. అయితే, మళ్లీ తిరిగి తాను అమెరికా వెళ్లేది లేదని స్నోడెన్ స్పష్టం చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలపై అక్కడ న్యాయమైన విచారణ జరిగే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే, విజిల్ బ్లోయర్ల (ప్రజా వేగులు) భద్రతను పటిష్టం చేయాలని కోరాడు. ఆన్ లైన్ ద్వారా జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఈ విషయాలు తెలిపాడు. అంతేగాక నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సహోద్యోగుల పాస్ వర్డ్ లను తాను దొంగిలించానంటు వస్తున్న వార్తలను స్నోడెన్ ఖండించాడు. కాగా, అమెరికాకు చెందిన పేరు వెల్లడించని సంయుక్త గూఢచారి అధికారుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలను కూడా తిరస్కరించాడు.

  • Loading...

More Telugu News