: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఉదయం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆయన తన కుమార్తె సౌందర్యతో కలసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రజనీకి ఆలయ అధికారులు, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన రజనీని చూసేందుకు ప్రజలు పోటీపడ్డారు.