: ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల నిందితుడి పిటిషన్ విచారణకు స్వీకరణ


1993 ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు ఖలిస్తాన్ తీవ్రవాది దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 28న పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. తనకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని భుల్లార్ పిటిషన్ లో కోరాడు. కాగా, క్షమాభిక్షకోసం దరఖాస్తు చేసుకున్న ఖైదీల విషయంలో నిర్ణయం ఆలస్యమైతే వారి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని సుప్రీం కొన్నిరోజుల కిందట కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భుల్లార్ పిటిషన్ వేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News